బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ క్రికెట్ ఆట నేపధ్యంతో తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే పెద్ది అంటే నాట్ జస్ట్ క్రికెట్... పెద్ది పహిల్వాన్ కుస్తీ పోటీలు కూడా అంటూ నేడు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఈరోజు శ్రీరామనవమి, రామ్ చరణ్ పుట్టినరోజు రెండూ కలిసి రావడంతో ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఇది కూడా పెద్దిపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు తమ ‘పెద్ది పహిల్వాన్’ కుస్తీ పోటీలు చూసి సంతోషంతో పొంగిపోతున్నారు.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నప్పుడు రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయమైంది. కానీ చికిత్స తీసుకొని నిన్నటి నుంచి మళ్ళీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న పెద్ది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.