నేడు భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతోంది. సిఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా శ్రీ సీతారాములను దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఉదయం 10.30 నుంచి 12.30 గంటల మద్య మిధిలా మండపంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. సిఎం రేవంత్ రెడ్డి దంపతులు శ్రీ సీతారాములకు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. తర్వాత భద్రాచలం ఆలయాభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు. ఆలయాభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసింది.
గతంలో మాజీ సిఎం కేసీఆర్‌తో సహా చాలా మంది ముఖ్యమంత్రులు, మంత్రులు భద్రాచలం శ్రీ సీతారాములను, అలాగే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని సందర్శించుకునేందుకు వెళ్ళలేదు. పదవీ గండం ఉంటుందనే మూఢ నమ్మకమే ఇందుకు కారణం.
కానీ సిఎం రేవంత్ రెడ్డి అలాంటి మూఢనమ్మకాలు లేవు. శ్రీ సీతారాములను దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుంది తప్ప కీడు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అందుకే నేడు సతీసమేతంగా భద్రాచలంలో శ్రీ సీతారాములను దర్శించుకొని వారి కల్యాణం కూడా పాల్గొంటున్నారు.