భద్రాచలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

March 27, 2026
img

భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ సీతారాముల కల్యాణం జరుగుతుంది. కనుక గురువారం రాత్రి స్వామివారిని పెళ్ళికొడుకుగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం రాత్రి ఏడు గంటలకు ఎదుర్కోలు వేడుక నిర్వహించారు. పెళ్ళికొడుకుగా వస్తున్న స్వామివారిని భక్తులు తన్మయత్వంతో  దర్శించుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు సుప్రభాతసేవ తర్వాత తిరువారాధన చేశారు.

అనంతరం మూలవరులకు అభిషేకం చేసి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల మద్య మిధిలా మండపంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది.

సిఎం రేవంత్ రెడ్డి దంపతులు శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భద్రాచలం ఆలయాభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారమే భద్రాచలం చేరుకొని ఆలయ అధికారులతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఆలయాభివృద్ధికి తయారుచేయించిన నమూనా చిత్ర పఠాన్ని మీడియాకు విడుదల చేశారు. ఆలయాభివ్రుద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసింది.  


Related Post