అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా లాంచనంగా ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కి జోడీగా కీర్తి సురేష్ లేదా కృతిశెట్టిలలో ఎవరో ఒకరిని లేదా ఇద్దరినీ ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడితో బాలకృష్ణ ప్రధాన పాత్రలో భగవంత్ కేసరి, చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలు నిర్మించిన సాహు గారపాటి ఈ సినిమాకి కూడా నిర్మాత. ఆయనతో బాటు డి సురేష్ బాబు, జీ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్గోనబోతున్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే రాకెట్ స్పీడుతో జరుగుతుంది. కనుక త్వరలో పూజా కార్యక్రమం జరిగితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు బహుశః రిలీజ్ డేట్ కూడా వచ్చేయవచ్చు.