బిజేపి ఎంపీ రఘునందన్ రావు నేడు మీడియాతో మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకునే హక్కు, అధికారం ఉంది. కనుక కల్వకుంట్ల కవిత పెట్టుకున్నారు. అయితే నేను చాలా కాలం క్రితమే బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని చెప్పాను. కల్వకుంట్ల కవిత పార్టీ పెడతారని కూడా చెప్పను. చెప్తే రఘునందన్ రావు ఏమైనా జ్యోతిష్యుడా? అని అడిగారు. నేను జ్యోతిష్యుడిని కాకపోవచ్చు. కానీ నా జోస్యం ఫలించింది కదా? బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలయ్యి క్రమంగా తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతుందని కూడా చెప్పాను. అది కూడా జరుగుతుంది. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి బోలెడు డబ్బు పోగేసుకున్నారు. ఆ డబ్బుని కాపాడుకోవడం కోసమే రాజకీయాలలో ఉన్నారు. చేతి నిండా అక్రమంగా సంపాదించిన డబ్బుంది కనుకనే ఇలా రాజకీయ పార్టీలు పెడుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలూ ఎన్నికల సమయానికి మాయం అయిపోతాయి,” అని రఘునందన్ రావు అసంచలన వ్యాఖ్యలు చేశారు.