ఫౌజీతో వస్తున్నాను: జయప్రద

March 28, 2026


img

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల నటి జయప్రద ఉత్తరాది రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాలలో కనిపించలేదు. మంచు లక్ష్మి నిర్వహించిన ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చినప్పుడు, ‘మళ్ళీ సినిమాలలో ఎప్పుడు కనిపిస్తారు? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు “ప్రభాస్‌ చేస్తున్న ఫౌజీలో నటిస్తున్నాను. మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను ఈ సినిమాతో కలుసుకోబోతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది,” అని జయప్రద అన్నారు. 

“కమల్ హాసన్, రజనీ కాంత్ ఇద్దరూ చాలా కాలం తర్వాత కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. దానిలో కూడా మీరు నటిస్తున్నారా?” అనే మరో ప్రశ్నకు వాళ్ళతోనే నా ‘అంతులేని కథ’ చేశాను. మన భారతీయ సినీ పరిశ్రమలో వాళ్ళిద్దరూ లిజండ్స్. అయినప్పటికీ ఎదిగుగుతున్న కొద్దీ ఒదిగి ఉండే గొప్ప వ్యక్తులు. వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం వస్తే నేను చాలా సంతోషిస్తాను,” అని జయప్రద అన్నారు. 

హను రాఘవపూడి దర్శకత్వం ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా ఇమాన్వీ నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, భాను చందర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.   

ప్రభాస్‌తో సినిమా అంటే అది తప్పనిసరిగా పాన్ ఇండియా మూవీయే. కనుక రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఫౌజీ ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష