కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ స్టార్ క్యాంపైనర్

March 28, 2026


img

ఏప్రిల్‌ 9న కేరళ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. గోవా ఉప ఎన్నికలు కూడా జరుగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారానికి సిఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ స్టార్ క్యాంపైనర్‌గా ఎంపిక చేసింది. కనుక సీఎంవో షెడ్యూల్, ఏఐసిసి ఇవ్వబోయే షెడ్యూల్ రెండూ మ్యాచ్ చేసుకొని సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. 

గతంలో కూడా సిఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ముంబై, బిహార్లో పాట్నా, కేరళలో వాయనాడ్, తిరువనంతపురంలో పర్యటించి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బిజేపి రెండు పార్టీలు ఎన్నికల సమయంలో తమ ముఖ్యమంత్రులను ఈవిధంగా ఎన్నికల ప్రచారంలో వాడుకుంటాయి. కనుక ఇదేమీ విశేషం కాదు కానీ ఇది కూడా కాంగ్రెస్‌ పార్టీలో సిఎం రేవంత్ రెడ్డి ఎదుగుదలకి సూచికగానే భావించవచ్చు. 



Related Post