అన్నయ్యతో కలిసి సంక్రాంతి బరిలోకి నిహారిక!

March 28, 2026


img

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిహారిక నిర్మాతగా మారి తన పేరుతోనే నిహారికా ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్న వరుణ్ తేజ్ హీరోగా ‘బరి’ అనే సినిమా మొదలుపెట్టారు. పల్లెటూరిలో బాస్కెట్ బాల్ ఆట నేపధ్యంతో తెరకిక్కించబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే చెప్పేశారు.

ఈ సినిమాకు కధ: వెంకట్ సుభాష్, ఉత్తమ్‌, రంజిత్ మారెడ్డి, విక్కీ, దర్శకత్వం: యదు వంశీ, సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: ధనుష్‌ భాస్కర్, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల, స్టంట్స్: ఎడిటింగ్: అన్వర్ అలీ చేస్తున్నారు. 

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెడతామని నిహారిక తెలిపారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేస్తామని చెప్పారు. సంక్రాంతికి చాలా సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఈ కథపై నమ్మకంతో సంక్రాంతి ‘బారి’లోకి దిగుతున్నానని నిహారిక చెప్పారు. ఈ సినిమాని కేవలం తెలుగులోనే తీయాలా లేదా పాన్ ఇండియా మూవీగా తీయాలా?అనేది అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిహారిక చెప్పారు. 

హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, అయన సోదరుడు నాగబాబు, ఇంకా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 


Related Post

సినిమా స‌మీక్ష