కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి నిన్న మొదటి పాట విడుదలైంది. ఈ లాంచింగ్ ఈవెంట్లో నిర్మాత ఎస్‌కెఎన్ మాట్లాడుతూ, “మా సినిమాని జూన్ 26న విడుదల చేయాలనుకున్నాము.
కానీ అదే సమయానికి ‘పెద్ది’ విడుదలవుతున్నందున మా సినిమా రిలీజ్ డేట్ తర్వాత ప్రకటిస్తాము,” అని చెప్పారు. ఇప్పటికే పెద్ది ఒకసారి వాయిదా పది ఏప్రిల్ 30కి మారింది. ఇప్పుడు జూన్ 25కి మారినట్లు నిర్మాత ఎస్‌కెఎన్ చెప్పడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఆయనే తాను పొరపాటున పెద్ది వాయిదా పడిందని చెప్పానంటూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
“మా సహా నిర్మాత సాయి రాజేష్ చెప్పిన విషయం నేను తప్పుగా అర్థం చేసుకొని పెద్ది వాయిదా పడిందని పొరపాటున చెప్పాను. సాయి రాజేష్ ఏమన్నారంటే పెద్ది రిలీజ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ట్వీట్స్ వస్తున్నాయి. కనుక ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే వరకు మన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించొద్దు,” అని సాయి రాజేష్ చెప్తే, ఆ శబ్దాలలో నాకు సరిగా వినిపించక రిలీజ్ డేట్ గురించి మాట్లాడమన్నారనుకొని అలా చెప్పాను. మిస్ కమ్యూనికేషన్ వల్లనే ఈ పొరపాటు జరిగింది. ఇందుకు క్షమాపణలు చెపుతున్నాను. పెద్ది వంటి పెద్ద సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్ అవుతుంది. అదో సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను,” అని నిర్మాత ఎస్‌కెఎన్ అన్నారు.
#Peddi రిలీజ్ డేట్ నేను ఎనౌన్స్ చేయలేదు.
— SZN (@Suzenbabu) March 30, 2026
క్షమించండి - #SKN https://t.co/Z4hO71zevz pic.twitter.com/2xR07npSZP