ఏప్రిల్‌ నుంచి చిరంజీవి-బాబీ కొల్లి సినిమా షురూ!

March 29, 2026


img

మెగాస్టార్ చిరంజీవికి ‘వాల్తేర్ వీరయ్య’తో హిట్ ఇచ్చిన బాబి కొల్లితో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చిరంజీవి-బాబీ మార్క్ పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి హీరోయిన్, ప్రధాన నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటిస్తారు. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్‌ ప్రధాన పాత్రలలో వచ్చిన ‘మనశంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు బాబి దర్శకత్వంలో తీస్తున్న సినిమా వచ్చే నెల షూటింగ్‌ మొదలుపెడితే, దసరా, దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష