విజయ్‌ దళపతి రెండు చోట్ల నుంచి పోటీ!

March 29, 2026


img

ఏప్రిల్‌ 23న తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈసారి కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ దళపతి టివికే పార్టీతో ఎన్నికల బరిలో ఒంటరిగా దిగుతున్నారు. ఈరోజు పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితా విడుదల చేశారు. ఎన్నికలలో పోటీ చేయడం ఇదే మొదటిసారి కనుక ముందస్తు జాగ్రత్తగా పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి విజయ్‌ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. 

నిన్న చెన్నైలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, “ఈసారి ఎన్నికలలో తమకు పోటీ ప్రధానంగా సిఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీయే తప్ప అన్నాడీఎంకే మరో పార్టీ కాదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఎన్నికలలో గెలిపిస్తే ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. 

రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పిస్తుంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపి పూర్తిగా అరికడతాం. రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నామని ఇప్పటికే నిరూపించుకున్నాము. అధికారంలోకి వచ్చినా మా విధానం ఇలాగే ఉంటుంది,” అని విజయ్‌ అన్నారు. 



Related Post