బాహుబలిని రికార్డ్స్ బద్దలుగొట్టిన ధురంధర్!

March 29, 2026


img

రాజమౌళి-ప్రభాస్‌-రానా కాంబినేషన్‌లో బాహుబలి-2 2017 ఏప్రిల్‌లో విడుదలైనప్పుడు అమెరికాలో రూ.1,800 కోట్లు పైగా కలెక్షన్స్‌ సాధించి ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ఆ రికార్డ్ అలాగే ఉంది. ఇన్నేళ్ళ తర్వాత రణవీర్ సింగ్ హీరోగా చేసిన ధురంధర్ ఆ రికార్డు బద్దలు కొట్టింది.

మార్చి 19న ధురంధర్ విడుదల కాగా మొదటి పది రోజులలోనే ఆ రికార్డు బద్దలు కొట్టి మరో సరికొత్త రికార్డు సృష్టించేందుకు దూసుకుపోతోంది. బాబుబలి రికార్డుని ధురంధర్ బ్రేక్ చేయడంపై నిర్మాత శోభూ యార్లగడ్డ చాలా సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా ఈ స్థాయిలో పోటీ పడుతూ ఎదుగుతుండటం చాలా సంతోషంగా ఉంది,” అంటూ ధురంధర్ టీమ్‌కి అభినందనలు తెలియజేశారు. 



Related Post

సినిమా స‌మీక్ష