పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసుకొని నవ్వులపాలవుతుంటే, కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు కొత్త సినీ నటీనటులతో తెలుగు రాష్ట్రాల గ్రామీణ కధలను చక్కగా తీస్తూ అందరినీ మెప్పిస్తున్నారు.
అలాంటిదే ‘అనకాపల్లి’ కూడా. ఖాగ్నేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా చేసిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. అనకాపల్లి పట్టణం నేపధ్యంలో సాగే క్రైమ్ స్టోరీలో చక్కటి ప్రేమ కథని జోడించి టీజర్ రూపంలో ప్రేక్షకుల ముందుంచారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: నక్కిన త్రినాథ రావు, పాటలు: అనంత శ్రీరాం, కేకే, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె, వి.కిరణ్ కుమారా, సంగీతం: దావ్జండ్, కెమెరా: మాయ వి, డైలాగ్స్: ఉదయ్ భాగవతుల, కోరియోగ్రఫీ: శేఖర్ విజే, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్, ఎడిటింగ్: స్రేఎక్రిశ్న అట్లూరి చేస్తున్నారు.
భావ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, నక్కిన త్రినాథరావు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కాబోతోంది.