అక్కినేని అఖిల్ అఖిల్ ‘లెనిన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చాలా భారీ అంచనాలతో ఏప్రిల్ 30న విడుదలవుతుండటంతో మే 1న విడుదల చేయాలనుకున్న ‘లెనిన్’ని జూన్ 26వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఇండస్ట్రీలో పరస్పరం గౌరవించుకుంటూ, అన్ని సినిమాలకు తగినన్ని థియేటర్లు లభించేందుకు, విజయావకాశాలు ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లెనిన్ టీమ్ చెప్తోంది.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ఈ సినిమా సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు.