ఇంట్లో తల్లితండ్రుకలు, కుటుంబ సభ్యుల రక్షణ నుంచి పాఠశాల, కాలేజీలలో అడుగుపెట్టే విద్యార్ధులకు ఉపాధ్యాయులే అండగా నిలబడతారు. వారే మార్గదర్శనం చేసి వారి భవిష్యత్‌ని తీర్చిదిద్దుతారు. అలాంటి ఉపాధ్యాయులే ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకునేంతగా వేధిస్తే?
ఈ ఘటన హైదరాబాద్, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో జరిగింది. ఆ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్ధినికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలున్నాయి. వాటి కోసం ఆమె పలుమార్లు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిలో చదువుకోవాలనే కోరిక చచ్చిపోతుంది. కానీ ఆమె ఎలాగో ఒకలా చదువుకోవాలనే ఆరాటపడింది.
కానీ ఆమె కాలేజీలో కొందరు ఉపాధ్యాయులు ఆమె గురించి చెడు ప్రచారం చేస్తూ నరకం చూపించారు. అనారోగ్యం, శస్త్ర చికిత్స వలన అనుభవిస్తున్న బాధల కంటే ఈ దుష్ప్రచారాలు వేధింపుల వలన కలిగే మానసిక క్షోభ భరించడం ఆమెకు కష్టంగా మారింది.
కనుక ఇటీవల ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. కానీ అదృష్టవశాత్తు బ్రతికింది. ఆ తర్వాత అందరూ ధైర్యం చెప్పడంతో మళ్ళీ కాలేజీకి వెళ్లి పరీక్షలు వ్రాసేందుకు సిద్ధపడింది. కానీ మళ్ళీ అధ్యాపకులు ఆమెతో అలాగే వ్యవహరించారు. పరీక్ష ఫీజు కట్టించుకోకుండా తిరస్కరించారు.
దీంతో ఆమెకు మహిళా సంఘాలు, తల్లి తోడుగా నిలిచారు. వారి సాయంతో యా విద్యార్ధిని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కాలేజీ అధ్యాపకులపై పిర్యాదు చేశారు. ఆమె ఏమందో ఆమె మాటల్లోనే...

పర్సనల్ ఫొటోలు వైరల్ చేశారు: విద్యార్థిని

ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజీలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘‘సర్జరీ అయ్యి కాలేజీ వెళ్లకపోతే లెక్చరర్‌లు చెడు వార్తలు ప్రచారం చేశారు. నా ఫోన్ తీసుకుని పర్సనల్ ఫొటోలు వైరల్ చేశారు. మా అమ్మ బాధపడుతుందని ఆమెకేమీ చెప్పలేదు.… pic.twitter.com/p1eO7cHjT0
— ChotaNews App (@ChotaNewsApp) March 29, 2026

Video source: Chota News App