ట్రంప్‌ చేతులెత్తేసినట్లేనా?

March 31, 2026
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ రోజుకో మాట.. పూటకో మాట మాట్లాడుతూ నవ్వుల పాలవుతున్నారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే హోర్మూజ్ జలసంధిపై ఇరాన్‌ ఒక శుభవార్త వినిపించబోతోందని మూడు రోజుల క్రితం చెప్పారు. 

నేడు తన ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో, “ఇరాన్‌ విషయంలో మాతో కలిసి రాని యూకేతో సహా యూరోపియన్ దేశాలకు నేను రెండు సూచనలు చేస్తున్నాను. 1. మా వద్ద భారీగా చమురు ఉంది కనుక మా వద్ద నుంచి కొనుగోలు చేయవచ్చు. 2. కాస్త ధైర్యం కూడగట్టుకొని హోర్మూజ్ జలసంధి కి వెళ్లి తెచ్చుకోండి. మీ అంతట మీరు పోరాడటం నేర్చుకోవాలి. మీరు ఏవిధంగా మాకు సాయపదకుండా దూరంగా ఉన్నారో అదేవిధంగా ఇకపై అమెరికా మీకు సాయపడదు. ఇరాన్‌ దాదాపు సర్వనాశనం అయ్యింది. క్లిష్టమైన ఈ పని మేము ఒక్కరమే పూర్తి చేశాము. కనుక వెళ్లి చమురు తెచ్చుకోండి,” అని ట్రంప్‌ తన అసహనం వ్యక్తం చేశారు. 

మరో పోస్టులో ఈ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ సహాయ నిరాకరణ చేసింది. తన గగనతలం మీదుగా మా యుద్ధ విమానాలు ఇజ్రాయెల్‌ వెళ్ళేందుకు అనుమతించలేదు. ఇది మేము తప్పక గుర్తుపెట్టుకుంటాము,” అని ట్రంప్‌ ఫ్రాన్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హర్మూజ్ జలసంధి గురించి ట్రంప్‌ చెప్పిన మాటలు: 

త్వరలోనే హోర్మూజ్ జలసంధిపై ఇరాన్‌ ఒక శుభవార్త వినిపించబోతోంది. 

మిత్రదేశాలు కలిసిరాకపోయినా పర్వాలేదు. అమెరికా ఒంటరిగా హోర్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకోగలదు. అమెరికా వద్ద అపారమైన ఆయుధ సంపద ఉంది.  

48 గంటలలో హోర్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలని ధ్వంసం చేస్తాం. తర్వాత ఈ గడువుని 5 రోజులకు, మళ్ళీ 10 రోజులకు పొడిగించారు.  

ఇప్పుడు హోర్మూజ్ జలసంధితో మాకు సంబంధం లేదు. మేము అక్కడికి రాము మీ తిప్పలేవో మీరు పడండి ట్రంప్‌ అంటున్నారు.  

Related Post