టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న సినిమాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మళ్ళీ చాలా కాలం తర్వాత ‘కాంతనార్: ది వైల్డ్ సోర్సరర్’ అనే సోషియో ఫ్యాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మళయాళ నటుడు జయసూర్య హీరోగా చేస్తున్నారు. ప్రముఖ మళయాళ దర్శకుడు రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తే, ఈ సినిమా గ్రాఫిక్స్, కెమెరా పనితనం అద్భుతంగా అనిపిస్తుంది.
ఈ సినిమాలో ప్రభుదేవ, సనూప్ సన్, శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ: ర్. రామానంద్, రోజిని థామస్, దర్శకత్వం: రోజిని థామస్, సంగీతం: రాహుల్ సుబ్రహ్మణ్యన్, కెమెరా: నెయిల్ డి కున, ఆర్ట్: అజిత్ కుట్టియాని, రాంప్రసాద్, స్టంట్స్: రోజిని థామస్, ఎడిటింగ్: రోజిని థామస్ చేశారు.
‘కాంతనార్’ని శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై బ్యానర్‌పై గోకులం గోపాలన్, బిజు గోపాలన్, విసి ప్రవీణ్ కలిసి నిర్మించారు. ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.