ఏప్రిల్‌ 30న ఎపిక్-ది ఫస్ట్ సెమిస్టర్?

March 31, 2026


img

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేస్తున్న ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మరో అనూహ్యమైన వార్త వినిపిస్తోంది. ఏప్రిల్‌ 30న విడుదల కావాల్సిన రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ జూన్ 25కి మారినట్లు వార్తలు వస్తుండటంతో, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని  ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ని ఏప్రిల్‌ 30న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మే 1 పబ్లిక్ హాలీడే, మే 2, 3 శని, ఆదివారాలున్నాయి. వరుసగా మూడు రోజులు సెలవులున్నాయి కనుకనే పెద్దిని ఏప్రిల్‌ 30న విడుదల చేద్దామనుకున్నారు. కానీ కుదరక జూన్ 25కి వెళ్తే ఈ వీకెండ్ స్లాట్ ఉపయోగించుకోవాలని దర్శకుడు ఆదిత్య హాసన్, నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.   

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: అజీం మొహమ్మద్, కోరియోగ్రఫీ: లీలావతి, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష