కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి ‘గుర్తుందా గుర్తుందా...’ అంటూ సాగే పాట సోమవారం విడుదల చేశారు. అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకి మణిశర్మ సంగీతం అందించగా హరిచరణ్, శ్రుతిక సముద్రాల కలిసి చాలా మధురంగా ఆలపించారు.
చెన్నై లవ్ స్టోరీ షూటింగ్ దాదాపు పూర్తయింది. జూన్ 26న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కానీ ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది’ మళ్ళీ వాయిదా పడి జూన్ 25కి మారితే చెన్నై లవ్ స్టోరీ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవికుమార్ నంబూరి, కధ: సాయి రాజేష్, సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్ చేస్తున్నారు.
మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్‌కెఎన్, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.