ఈటీవీ విన్‌లో గుణశేఖర్ ఇఫోరియా…

March 31, 2026


img

గుణశేఖర్ దర్శకత్వంలో భూమిక సారా అర్జున్, నాజర్, రోహిత్ రెడ్డి, విగ్నేష్ గవిరెడ్డి ప్రధాన పాత్రలు చేసిన ‘ఇఫోరియా’ ఫిభ్రవరి 6న థియేటర్లలో విడుదలై ఓకే అనిపించుకుంది. ఇప్పుడీ సినిమా ఏప్రిల్‌ 2 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కాబోతోంది. 

క్లుప్తంగా కథ: ధనిక కుటుంబానికి చెందిన చైత్ర (సారా అర్జున్)  చదువులలో టాపర్‌. ఓ రోజు పబ్‌లో ఓ పార్టీకి హాజరయ్యి తిరిగి వెళుతుండగా వికాస్ (విగ్నేష్ గవిరెడ్డి) కారులో ఎక్కుతుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న అతనితో సహా నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం చేస్తారు. పోలీస్ కమీషనర్‌ జయదేవ్ (గౌతమ్‌ మేనన్) ఈ కేసుని ఏవిధంగా పరిష్కరించారు. దేనికోసం ఆయన ‘ఆపరేషన్ యుఫోరియా’ చేపట్టారనేది సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది.     

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణ శేఖర్, సంగీతం: కాల భైరవ్, కెమెరా: ప్రవీణ్ కే పోతన్, డైలాగ్స్: నాగేంద్ర కాశీ, కృష్ణ హరి, ఆర్ట్:శ్రీనివాస్‌ కళింగ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి చేస్తున్నారు. 

గుణా ప్రొడక్షన్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్త గుణ కలిసి ఈ సినిమా నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష