తెలంగాణలో పారిశ్రామిక విద్యుత్ ఛార్జీలు పెరిగాయి

April 01, 2026
img

తెలంగాణలో పారిశ్రామిక రంగానికి విద్యుత్ షాక్ తగిలింది. హెచ్‌టి సర్వీసులు కలిగిన పరిశ్రమలకు ఏప్రిల్‌ 1 నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఈఆర్‌సీ డిస్కంలను ఆదేశించింది. 

వేసవి ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. డిమాండ్-సప్లై మద్య చాలా తేడా ఉండటంతో గ్రిడ్స్ ఒత్తిడికి గురవుతున్నాయి. 

కనుక ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు స్లాట్ ఎంచుకొని విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. వేరే సమయంలో వాడుకునే విద్యుత్ కు యూనిట్‌కి రూ.1.50 చొప్పున అదనంగా వసూలు చేయబోతోంది. దీనినే ‘టైమ్‌ ఆఫ్ డే రీఫ్’ విధానంగా పేర్కొంటోంది. 

హెచ్‌టి సర్వీసులలో గల ఆరు క్యాటగిరీలకు దీనిని వర్తింపజేస్తున్నట్లు ఈఆర్‌సీ ప్రకటించింది. దీని ప్రకారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల స్లాట్ ఎంపిక చేసుకొని ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే పరిశ్రమలకు యూనిట్‌కి 50 పైసలు చొప్పున ప్రోత్సాహకం ఇస్తుంది. గతంలో ఇది  యూనిట్‌కి ఒక రూపాయి ఉండేది. అదే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు స్లాట్ ఎంచుకొని విద్యుత్ వినియోగించుకునే పరిశ్రమలకు ఎటువంటి రాయితీ ఉండదు. గతంలో ఛార్జీలే వర్తిస్తాయి. 

ఆరు కేటగిరీలు ఇవే: హెచ్‌టి-1 (ఏ): సాధారణ పరిశ్రమలు, కోళ్ళ ఫారాలు, హెచ్‌టి9: విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్స్, హెచ్‌టి11(ఏ):ఇతర పరిశ్రమలు, హెచ్‌టి11(బి):మతపరమైన సంస్థలు, హెచ్‌టి111: బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌ స్టేషన్లు, విమానాశ్రయాలు.

Related Post