రాజకీయ కారణంతోనే జననాయకుడుని అడ్డుకున్నారు!

April 02, 2026


img

టివికే పార్టీ అధినేత విజయ్‌ నేడు భారీ ర్యాలీతో వెళ్లి ‘తిరుచురాపల్లి ఈస్ట్’లో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాజకీయ దురుదేశ్యంతోనే నేను చివరిగా నటించిన జన నాయగన్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. కానీ సినిమాని ఆపేస్తే బిజేపికి లొంగిపోతానని ఎలా అనుకున్నారో తెలీదు.

సినిమా ఇవ్వాళ్ళ కాకపోతే రేపు ఎన్నికలలో గెలిచిన తర్వాత అట్టహాసంగా విడుదల చేసుకుంటాము. నేను రాజకీయాలకు కొత్త. అలాంటి నన్ను చూసి బిజేపి భయపడుతోందంటే మన బలం ఎంతో అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్ళు పెట్టినా నేను ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం, తమిళ ప్రజలే నాకు ముఖ్యం. మా పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మార్పు చూపిస్తాం,” అని విజయ్‌ అన్నారు. 

జన నాయగన్ సినిమాకి సెన్సార్ బోర్డు కుంటి సాకులు చెపుతూ రిలీజ్ కాకుండా అడ్డుకున్నప్పుడు విజయ్‌ ఈ రాజకీయ ఒత్తిళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇప్పుడు బహిరంగంగా బిజేపిని వేలెత్తి చూపుతూ విమర్శిస్తున్నారు.

ఈ ఒంటరి పోరాటంతో టివికే పార్టీని గెలిపించుకొని విజయ్‌ ముఖ్యమంత్రి కాగలిగితే ఇక తమిళనాడు రాజకీయాలలో మరోసరి కొత్త అధ్యాయం మొదలైనట్లే. లేకుంటే బిజేపి-అన్నాడీఎంకేలతో పొత్తు నిరాకరించినందుకు తాపీగా పశ్చాతాప పడాల్సి వస్తుంది.  


Related Post