అమెరికా పశ్చాతాప పడేవరకు యుద్ధం: ఇరాన్‌

April 02, 2026


img

ఇరాన్‌ పని ముగిసిపోయినట్లే మరోసారి దాడిచేసి ఇరాన్‌ని నేలమట్టం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చెప్పడాన్ని ఇరాన్‌ తీవ్రంగా తప్పు పట్టింది.

ఇరాన్‌ మళ్ళీ రాతియుగానికి చేరుకుంటుందని ట్రంప్‌ చెప్పడం కాదు. ఆయనే రాతియుగం నాటి నేరాలను ఈ అత్యాధునిక యుగంలో అమలు చేస్తున్నారు. తన యుద్ధోన్మాదానికి ఇరాన్‌లోని అభం శుభం తెలీని చిన్నారులను, ప్రజలను బలిగొనడం రాతియుగం నాటి నేరస్వభావమే కదా?

ఇరాన్‌ సైనిక శక్తి గురించి అమెరికా తక్కువ అంచనా వేసి ఈ ఊబిలోకి దిగింది. కనుక అమెరికా పశ్చాతాపపడి బేషరతుగా క్షమాపణలు చెప్పేవరకు ఈ యుద్ధం కొనసాగిస్తాము. ఇరాన్‌తో యుద్ధం ఓ చారిత్రిక తప్పిదమని అమెరికా తప్పకుండా గ్రహిస్తుంది,” అని ఇరాన్‌ మిలటరీ కమాండ్ కంట్రోల్ ప్రతినిధి మీడియా ద్వారా హెచ్చరించారు. 

ఒకవేళ ట్రంప్‌ చెప్పినట్లు ఇరాన్‌ పని దాదాపు ముగిసిపోయినట్లయితే, అది నేటికీ ఇజ్రాయెల్‌, గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం ఎలా కురిపిస్తోంది? నిర్దిష్ట లక్ష్యాలను గుర్తించి ఎలా దాడులు చేయగలుగుతోంది?

హోర్మూజ్ జలసంధిని ట్రంప్‌ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? ఖర్గ్ ఐలాండ్‌పై హరీష్ రావు శక్తివంతమైన ఆయుధాలు కలిగిన అమెరికా సేనలను దింపేందుకు ట్రంప్‌ ఎందుకు భయపడుతున్నారు? అనే ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి ఉంటుంది కదా?       



Related Post