రౌడీ జనార్ధనకు ప్రొడక్షన్ ట్రెయినీలు కావలెను

April 02, 2026


img

రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘రౌడీ జనార్ధన’ నుంచి ఓ అనూహ్యమైన ప్రకటన వచ్చింది. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ ట్రెయినీలు కావాలంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. కనీసం డిగ్రీ చేసి  ఉండాలి. వర్డ్, ఎక్స్‌ఎల్, పవర్ పాయింట్ వగైరాలు ఉపయోగించడం రావాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. సినీ నిర్మాణంపై ఆసక్తి కలిగి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తులు పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్: chandurj.svc@gmail.com  

రౌడీ జనార్ధనలో విజయ్‌ దేవరకొండకు జంటగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవికిరణ్ కోలా, అడిషనల్ స్క్రీన్ ప్లే: జనార్ధన పసుమర్తి, సంగీతం: క్రిస్టో జేవియర్, కెమెరా: ఆనెంద్‌ సి చంద్రన్, స్టంట్స్:సుప్రీం సుండ, ఆర్ట్: సత్యనారాయణ డివై చేశారు.  

ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు పాన్ ఇండియా పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో   నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు టైటిల్‌ గ్లిమ్స్‌లో చూపారు.  


Related Post

సినిమా స‌మీక్ష