సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు.
హీరో, హీరోయిన్ కొత్తవారైనప్పుడు సినిమాని బ్యాలన్సింగ్ చేసేందుకు సీనియర్ నటులను జోడిస్తుంటారు. అలాగే శ్రీనివాస మంగాపురంలో సీనియర్ నటుడు నరేష్ ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో అయన పాత్ర పేరు స్వాతంత్ర బాబు. ఇది నరేష్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని దర్శకుడు అజయ్ భూపతి చెప్పారు. ఈ సినిమాలో మోహన్ బాబు ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. ఈ నెల 14న ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.