రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాశి నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ విలన్ కుంభగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ సినిమాలో తను నటించాల్సిన సన్నివేశాలు పూర్తిచేశానని ట్వీట్ చేశారు.
ఈ సినిమా కోసం డైటింగ్ చేస్తూ కడుపు మాడ్చుకొని పని చేశానని, షూటింగ్ పూర్తవగానే నిర్మాత నారాయణ పంపించిన క్యారేజిలో పసందైన రొయ్యల వేపుడు, బిర్యాని వగైరా కడుపు నిండా తిన్నానని పృద్విరాజ్ సుకుమార్ ట్వీట్ చేశారు.
రాజమౌళిని మెప్పించడం చాలా కష్టం కనుక ఆయన కోసం నా ప్రాణం, కడుపు పణంగా పెట్టి పనిచేశాను. ఎట్టకేలకు ఈ సినిమాలో నా పోర్షన్ పూర్తిచేసి బయటపడ్డాను. ఇన్ని రోజుల తర్వాత ఇవాళ్ళ కడుపు నిండా భోజనం చేశాను,” అని పృద్విరాజ్ సుకుమార్ చెపుతుంటే నిర్మాత నారాయణతో సహా యూనిట్ సభ్యులందరూ హాయిగా నవ్వుకున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా ‘మందాకిని’గా నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు.
ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు.
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.