అల్లు అర్జున్‌-అట్లీ సినిమా టైటిల్‌ పోస్టర్ రేపే!

April 07, 2026


img

కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వం అల్లు అర్జున్‌ హీరోగా చేస్తున్న సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ ఇవ్వడం లేదంటూ అభిమానులు తీవ్ర నిరాశగా ఉన్నారు. వారికి ఓ శుభవార్త. బుధవారం ఉదయం 11గంటలకు ఈ సినిమా టైటిల్‌ పోస్టర్ విడుదల చేస్తామంటూ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఓ పోస్టర్ పెట్టింది. దానిలో పదునైన గోళ్ళతో ఓ జంతువు చేతిని చూపారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ అని ముందే చెప్పారు. 

కొన్ని నెలల క్రితం అల్లు అర్జున్‌, అట్లీ కలిసి లాస్ ఏంజలెస్‌లో ప్రముఖ వీఎఫ్ఎక్స్‌ స్టూడియోకి వెళ్ళి వెళ్ళారు. అక్కడే వీఎఫ్ఎక్స్‌ కోసం అల్లు అర్జున్‌ని స్కానింగ్ చేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. 

ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు. 

అల్లు అర్జున్‌ లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్దా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు  బన్నీవాస్, నట్టి, శాండీ, స్వాతి సహా నిర్మాతలు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష