విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్ళి తర్వాత జంటగా చేస్తున్న సినిమా ‘రణబాలి.’ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీలక సన్నివేశాలను రాయలసీమలో షూటింగ్ చేశారు. రాయలసీమ షెడ్యూల్ పూర్తయిందని తెలియజేస్తూ రణబాలి టీమ్ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. దానిలో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు పెళ్ళి తర్వాత తొలిసారిగా జంటగా కడపకు వచ్చినప్పుడు అభిమానులు వారికి స్వాగతం పలకడం, అభిమానుల బైక్ ర్యాలీ, స్థానిక ఫంక్షన్ హాల్లో అభిమానులతో కలిసి విజయ్ దేవరకొండ ఫోటోలు దిగడం వగైరా ఉన్నాయి. తమ అభిమాన హీరోతో కలిసి ఫోటోలు దిగడమే కాకుండా ఈవిధంగా రణబాలి తరపున వీడియో కూడా విడుదల చేయడంతో వారి ఆనందానికి అంతే లేదు.
బ్రిటిష్ కాలంలో రాయలసీమలో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. దీనిలో దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ బ్రిటిష్ అధికారిగా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.
గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి 5 భాషల్లో రణబాలి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.