బెల్లంకొండ శ్రీనివాస్-కావ్య పెళ్ళి 29న తిరుపతిలో

April 07, 2026


img

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యల వివాహ నిశ్చితార్ధం హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో జరిగింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ముచ్చటగా ఈ వేడుక జరిగింది. ఈ నెల 29న తిరుపతిలో వీరి వివాహం జరుగబోతోంది. హైదరాబాద్‌లో పెళ్ళి రిసిప్షన్ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన బెల్లంకొండ శ్రీనివాస్ సినీ నిర్మాణ రంగంలో ప్రవేశిస్తారనుకుంటే ‘అల్లుడు శీను’తో నటుడుగా ఎంట్రీ ఇచ్చి వరుసపెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ సినిమాల్లో నటిస్తున్నారు. 

కావ్యా కుటుంబంలో ఎవరికీ సినీ పరిశ్రమతో సంబంధం లేదు. ఆమె తండ్రి, తాతగారు న్యాయవాదులే. కానీ ఇరు కుటుంబాల మద్య చాలా కాలంగా మంచి సత్సంబందాలున్నాయి. అలా శ్రీనివాస్-కావ్య మద్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. వారి ప్రేమని ఇరు కుటుంబాలు ఆమోదించడంతో త్వరలో పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష