సంజయ్ దత్త్, నోరా ఫతేహి ఇద్దరూ రావాల్సిందే!

April 07, 2026


img

ప్రేమ్‌ దర్శకత్వంలో ద్రువ్ సర్జా హీరోగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో డబుల్ మీనింగ్ పాట ‘సర్కే చునార్ తేరీ సర్కే’పై ప్రజలు, మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, దర్శక నిర్మాతలు అందరికీ క్షమాపణలు చెప్పుకొని యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో నుంచి ఈ పాటని ఉపసంహరించుకున్నారు. 

కానీ జాతీయ మహిళా కమీషన్ దీనిపై సుమోటుగా కేసు నమోదు చేసి ఆ సినిమా దర్శకుడు ప్రేమ్‌, పాట రచయిత రకీబ్ ఆలంకు నోటీసులు పంపింది. వారు విచారణకు హాజరయ్యి కమీషన్‌కు క్షమాపణలు చెప్పుకున్నారు.

ఈ పాటకు బాలీవుడ్‌ సీనియర్ నటుడు సంజయ్ దత్త్, నోరా ఫతేహీ డాన్స్ చేయడంతో వారిరువురికి కూడా మహిళా కమీషన్‌ నోటీసులు పంపింది. కానీ ఇద్దరూ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్‌ 8న సంజయ్ దత్త్, ఏప్రిల్‌ 27న నోరా ఫతేహీ హాజరయ్యి వివరణ ఇవ్వాలని మహిళా కమీషన్‌ ఆదేశించింది.

పాట అసభ్యంగా, మహిళలను కించపరిచేవిధంగా ఉంటే ఆ పాటకు అర్థం తెలియదని తప్పించుకోవాలనుకుంటే కుదరదని, అర్థం తెలియకుండానే పాటని చిత్రీకరించారా? డాన్స్ చేశారా? అని మహిళా కమీషన్‌ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.       



Related Post

సినిమా స‌మీక్ష