రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో నాగశౌర్య, విధి యాదవ్ జంటగా చేసిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో సముద్రఖని, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్), సంగీతం: హ్యారీస్ జయరాజ్, కెమెరా: రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రామాంజనేయులు, స్టంట్స్: సుప్రీం సుందర్ పృధ్వీ, కొరియోగ్రఫీ: రాజు సుందరం మాస్టర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
కొత్తగా సినీ నిర్మాణ రంగంలోకి వచ్చిన వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్:1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి కలిసి నిర్మిస్తున్న ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.