వారణాశికి ఇంకా 365 రోజులే: కీరవాణి

April 07, 2026


img

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘వారణాశి’ 2027, ఏప్రిల్‌ 7వ తేదీన విడుదల కాబోతోంది. అంటే సరిగ్గా ఏడాది తర్వాత ఇదే రోజున వారణాశి విడుదల కాబోతోందన్న మాట! ఇదే విషయం గుర్తుచేస్తూ సంగీత దర్శకుడు కీరవాణి ‘365’ అని ట్వీట్‌ చేశారు.

ఈ సినిమా కథ చాలా విస్త్రుతమైనది కనుక రెండు భాగాలుగా తీయవచ్చని ముందు అనుకున్నప్పటికీ ఒకే భాగంగా తీస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకటా లేదా రెండు భాగాలా? వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదలయ్యేది వారణాశి మొదటి భాగమా లేదా ఒకటే భాగమా అనేది రాజమౌళి లేదా వారణాశి టీమ్‌లో ఎవరో ఒకరు చెప్తే గానీ తెలియదు.   

ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడుగా కూడా నటిస్తున్నట్లు ఇప్పటికే చెప్పేశారు. కనుక మహేష్ బాబు పౌరాణిక పాత్ర చేయడం అందునా శ్రీరాముడిగా కనిపించడం అభిమానులకు చాలా సంతోషం కలిగించే విషయమే.    

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, విలన్‌ కుంభగా మలయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్, మందాకినిగా బాలీవుడ్‌ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా నటిస్తున్నారు.            

ఈ సినిమాకి కధ: విజయేంద్ర ప్రసాద్, డైలాగ్స్: దేవకట్ట, సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఎస్.గోపాల్ రెడ్డి, పిఎస్ వినోద్,వీఎఫ్ఎక్స్‌: శ్రీనివాస్ మోహన్, సందీప్ కమల్‌, మోహన్ నాథ్ బింగి చేస్తున్నారు. 

ఆర్ట్: సందీప్ సువర్ణ, ఎడిటింగ్: బిక్కిన తమ్మరాజు, స్టంట్స్: కింగ్ సోలోమన్, లైన్ ప్రొడ్యూసర్: ఎంఎం శ్రీవల్లి, కాస్ట్యూమ్స్: రమ రాజమౌళి, ఎస్ఎస్ కార్తికేయ: ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ చేస్తున్నారు. 

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ కలిసి సుమారు రూ.1,100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా  నిర్మిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 7న వారణాశి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష