నేడే డెకాయిట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌... హైదరాబాద్‌లో!

April 07, 2026


img

అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేస్తున్న‘డెకాయిట్-ఒక ప్రేమ కధ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఈరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగబోతోంది. దీనిలో పాల్గొనలేకపోయిన వారికోసం యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. దాని లింక్: https://youtube.com/live/dkHJInAGWnU  ద్వారా చూడవచ్చు. 

షానీల్ డియో దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జాన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్‌ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే: అడవి శేష్, షనీల్ డియో, డైలాగ్స్: అబ్బూరి రవి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ధనుష్ భాస్కర్, ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్‌, యాక్షన్: ఏ విజయ్ చేశారు. 

డెకాయిట్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మించిన డెకాయిట్ ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష