బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న ‘పెద్ది’ ఈ నెల 30న విడుదల కావాల్సి ఉండగా జూన్ 25కి వాయిదా పడినట్లు నిర్మాత ఎస్‌వికె బయటపెట్టేశారు. ఆయన ‘తూచ్’ అన్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం ఖండించలేదు. ఈ నెల 30నే విడుదలవుతుందని ధ్రువీకరించలేదు.
కనుక పెద్ది వాయిదా పడిన మాట వాస్తవమే అని స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఓటీటీ కంపెనీతో చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ది వాయిదా వేయడం వలన సదరు ఓటీటీ సంస్థకు చెల్లించాల్సిన జరిమానా, ఓటీటీలో తగిన స్లాట్, పెద్ది సూపర్ హిట్ అయితే ఓటీటీ సంస్థ చెల్లించాల్సిన అదనపు పారితోషికం తదితర అంశాల గురించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి ఫైనల్ అయితే పెద్ది కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్, కోచ్ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.