మే 8న రవిబాబు రేజర్ విడుదల

April 11, 2026


img

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత రవిబాబు ఎక్కువగా క్రైమ్‌, థ్రిల్లర్ సినిమాలు చేస్తుంటారు. ఆ సినిమాలకు అభిమానులు చాలా మందే ఉన్నారు. రవిబాబు స్వీయ దర్శకత్వంలో ‘రేజర్’ అనే మరో యాక్షన్ సినిమా తీస్తున్నారు. 

ఈ సినిమాలో రవిబాబు ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 8వ తేదీన రేజర్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ ఓ వీడియో క్లిప్ విడుదల చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రవిబాబు, సంగీతం:ఎస్ఎస్ రాజేష్, కెమెరా: చరణ్ మాధవనేని చేశారు.

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు ఈ సినిమా నిర్మించారు.       

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/__CTmz9L_bs?si=kViod6KolMcFIRdh" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష