ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మృణాల్ ఠాకూర్‌ని ఉద్దేశ్యించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మృణాల్ ఒక అద్భుతమైన నటి. అతి తక్కువ సమయంలోనే ఆమె తన ప్రతిభతో అందరి మనస్సులో స్థానం సంపాదించారు.
సీతారామం సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మృణాల్ ఠాకూర్‌కి ఉజ్వలమైన భవిష్యత్ ఉంది.
ఇదివరకు నేను లావణ్య త్రిపాఠిని ఇలాగే ఆశీర్వదిస్తే ఆమె మా అబ్బాయి వరుణ్ తేజ్‌ని పెళ్ళి చేసుకొని మా ఇంటి కోడలిగా వచ్చింది. ఇక్కడే సెటిల్ అయిపొయింది.
ఇప్పుడు నేను మృణాల్ ఠాకూర్‌ని కూడా మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఆమె కూడా ఇక్కడి అబ్బాయినే చూసుకొని పెళ్ళి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను,” అని అల్లు అరవింద్ అన్నారు.
సినీ పరిశ్రమలో కులమతాలు, భాషలు, ప్రాంతాల పట్టింపులు పెద్దగా ఉండవు కనుక వాటికి అతీతంగా ప్రేమలు, పెళ్ళిళ్ళు జరిగిపోతుంటాయి.
కర్ణాటకకు చెందిన రష్మిక మందన తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండని వివాహం చేసుకోగా, కేరళకు చెందిన సమంత బాలీవుడ్‌కి చెందిన రాజ్ నిడిమోరుని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ హిస్టరీ తిరగేస్తే ఇలాంటి పెళ్ళిళ్ళు చాలానే కనిపిస్తాయి. కనుక అల్లు అరవింద్ దీవెన ఊరకపోదు. మృణాల్ కూడా తెలుగింటి కోడలే అవుతుందేమో?