‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమా పేరు ‘భారతవర్ష’ అని ఖరారు చేస్తూ ‘ది సాగా ఆఫ్ శూల’ పేరుతో టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. క్రీస్తు శకం 642 నాటి పీరియాడికల్ మూవీ అని టైటిల్ గ్లిమ్స్ చెప్పేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూవర్మని ఖరారు చేశారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు సత్యవతి. ఆమె కూడా పోరాట యోదురాలే నని ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చెప్పేశారు.
ఈ సినిమాలో వినోద్ కుమార్, గావీ చాహల్, తణికెళ్ల భరణి, రాకేష్ వర్రే, భారత్ రెడ్డి, ఛత్రపతి శేఖర్, రవి వర్మ, కిషోర్, కార్తికేయ, మధుమణి, బేబీ తేజల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: సంకల్ప్ రెడ్డి, పాటలు: చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి
సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, అదనపు డైలాగ్స్: వినయ్ వొక్కపట్ల, ఆర్ట్: స్టంట్స్: వెంకట్, పృధ్వి, రియల్ సతీష్, రాజేష్ లంకా, వెంకటరావు, ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
చేశారు.
సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.