డీలిమిటేషన్‌పై తొందరపాటు వద్దు: సిఎం రేవంత్ రెడ్డి

April 14, 2026


img

డీలిమిటేషన్‌ విషయంలో తొందరపాటు వద్దని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రానికి సూచించారు. ఇది కేంద్రానికి మాత్రమే సంబందించిన అంశం కాదని, యావత్ దేశ ప్రజలకు సంబందించిన అంశమన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంలో అన్ని పార్టీల సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తీసుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో మహిళా రిజర్వేషన్స్ బిల్లు ముడి పెట్టాలనుకోవడం సరికాదన్నారు. 

దక్షిణాదిలో 5 రాష్ట్రాలు, పశ్చిమాన్న రెండు రాష్ట్రాల నుంచి జీఎస్టీ ఆదాయంలో 53 శాతం కేంద్రానికి వస్తోంది. కనుక వాటికి ‘గ్రోత్ డివిడెండ్’గా జీఎస్టీ ఆదాయంలో 50 శాతం ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇందుకు సిఎం రేవంత్ రెడ్డి ఓ లెక్క చెప్పారు. డీలిమిటేషన్‌ ద్వారా 543 లోక్‌సభ సీట్లు 815కి పెరుగుతాయి. కనుక ఆ పెరిగే  272 సీట్లలో సగం 136 సీట్లు ఈ ఏడు రాష్ట్రాలలోనే ఉన్నాయి. కనుక ఆ ప్రకారమే వాటికి 50 శాతం ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో కూడా సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానానికి ఈ ప్రతిపాదనలు వివరించారు. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం కలిసి వస్తే తప్ప సిఎం రేవంత్ రెడ్డి పోరాటాలు ఫలించవు. 



Related Post