మహేష్ ఉప్పల దర్శకత్వంలో అయినేష్, అనశ్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ నుంచి ‘హాయ్ రే..’ పాట విడుదలైంది. కళ్యాణ్ చక్రవర్తి వ్రాసిన ఈ పాటకి తమన్ స్వరపరిచి సంగీతం అందించి, మరో సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్‌తో కలిసి పాడారు.
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి కధ, దర్శకత్వం: మహేష్ ఉప్పల, సంగీతం: తమన్, కెమెరా: రాజా మహదేవన్, స్టంట్స్:దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: కోటి చేశారు.
వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్: నం:1గా తీస్తున్న ఈ సినిమాకి నిర్మాత ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల.