రైతు డిస్కంపై కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే..

May 31, 2026


img

తెలంగాణ ప్రభుత్వం త్వరలో రైతు డిస్కం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల నుంచి రైతు డిస్కం వేరు చేయడంపై టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ, “ ఈ రైతు డిస్కం ఏర్పాటుపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. 

రైతు డిస్కం ఏర్పాటు చేసినా మోటర్లకు మీటర్లు పెట్టబోమని, ఒకవేళ పెడితే ఎన్నికలలో పోటీ చేయబోమని సిఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మంచిదే. కానీ ఉత్తర, దక్షిణ డిస్కంలను ప్రైవేటీకరణ చేయడానికే రైతు డిస్కంని వేరు చేస్తున్నారని మాకు అనుమానాలున్నాయి. 

కనుక ఈ రైతు డిస్కం ఏర్పాటు చేసిన తర్వాత ఆ రెండింటినీ ప్రైవేటీకరణ చేయబోమని, చేస్తే ఎన్నికలలో పోటీ చేయబోమని సిఎం రేవంత్ రెడ్డి చెప్పగలరా? లేకుంటే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకే రైతు డిస్కం విడదీశారని అనుమానించాల్సి ఉంటుంది,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.


Related Post