మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, అలనాటి అందాల నటి రవీనా టాండన్ కుమార్తె రాషా దడాని హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం.’ తిరుపతి పట్టణంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథ ఇది. జయకృష్ణ ఎంట్రీ కాస్త గ్రాండ్‌గానే ఉండాలి కనుక మంగాపురంలో యాక్షన్ సీన్స్ కూడా జోడించారు. వాటి క్లిప్పింగ్ రిలీజ్ చేసారు. తొలి సినిమా అయినా కుటుంబంలో సినిమా రక్తం ఉంది కనుక ఫైట్స్ బాగానే చేశాడు. ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్ ముఖ్య పాత్రలు చేశారు.
అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీతం: జీవి.ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్‌డీ రాజశేఖర్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.