విశ్వక్ సేన్‌ కొత్త సినిమాకి పూజా కార్యక్రమం

April 14, 2026


img

విశ్వక్ సేన్‌ ప్రస్తుతం కల్ట్, లెగసీ రెండు సినిమాలు చేస్తున్నారు. మరో కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. రజత్ దర్శకత్వంలో తీయబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఎన్టీఆర్‌తో దేవర సినిమా తీసిన సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాని తన యువ సుధ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. 

ఈ కార్యక్రమం నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టి స్క్రిప్ట్ నిర్మాతకు అందించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్న విశ్వక్ సేన్‌ దీని నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు.        

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: రజత్, సంగీతం: తేజస్ కృష్ణ, కెమెరా: అరవిద్న్ విశ్వనాథన్, డైలాగ్స్: భాను భోగవరపు చేస్తున్నారు. ఇదొక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ సినిమా అని దర్శకుడు రజత్ చెప్పారు. త్వరలోనే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.  



Related Post

సినిమా స‌మీక్ష