ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఖమేనీ చనిపోయారని తెలియజేశారు.
‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిసి ఇరాన్ అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడిలో ఖమేనీతో సహా ఆయన అల్లుడు, కుమార్తె, కోడలు, మనవరాలు ఇంకా అనేక మంది మరణించారు. ఇరాన్ ప్రభుత్వం కూడా ఖమేనీ మరణ వార్తను ధ్రువీకరించాయి. అధ్యక్షుడు మృతికి సంతాపంగా 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించబోతున్నట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ట్రంప్ టార్గెట్ ఖమేనీ హతం అయ్యారు కనుక ఇప్పుడు ఆయన స్థానంలో ఆయనకు నచ్చినవారిని కూర్చోపెట్టడం ఖాయమే.