అగధ షూటింగ్‌ సమాప్తం.. నటీనటులెవరో తెలీదు!

April 15, 2026


img

ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అగధ’ సినిమా షూటింగ్‌ పూర్తయిందనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేసే వరకు ఎవరికీ తెలియదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల కాబోతోంది.

గమ్మతైన విషయం ఏమిటంటే, నేటికీ ఈ సినిమా నటీనటులు ఎవరో బయటపెట్టలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. కానీ దానిలో అమ్మవారి విగ్రహం ముందు నిలబడున్న యువతి ఎవరో తెలీకుండా దాచి పెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎమ్మెస్ రాజు మీడియా ప్రతినిధులకు అగధ సినిమా వివరాలు తెలియజేశారు. 

“ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. ఈ సినిమాలో నటించిన నటీనటుల పేర్లు త్వరలో ప్రకటిస్తాం. ఈ సినిమాని కేవలం 85 రోజుల్లోనే పూర్తి చేశాం. దీనిలో 45 నిమిషాల విఎఫ్‌ఎక్స్ ఉంది. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల చేస్తున్నాము,” అని చెప్పారు. 

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బలుసు కాశీ విశాలాక్షి ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం: మిక్కిన్ అరుల్ దేవ్, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ, అడిషనల్ స్క్రీన్ ప్లే: చైతన్య వేగి చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష