ఇటీవల బైకర్ సినిమాతో హిట్ కొట్టిన శర్వానంద్, అదే ఊపులో మరో హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ‘భోగి’చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని కీలకమైన పోరాట దృశ్యాలను ఏపీలోని రంపచోడవరం వద్ద దట్టమైన అడవులలో షూటింగ్ చేస్తున్నారు. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశాలలో హీరో శర్వానంద్‌తో సహా ఇతర నటీనటులు కూడా పాల్గొంటున్నారు.
1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాల నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
సూపర్ హిట్ ‘శతమానం భవతి’లో శర్వాకు జోడీగా చేసిన అనుపమ పరమేశ్వరన్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఈ ‘భోగీ’లో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హాయతి కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 28న విడుదల కాబోతోంది.