డీలిమిటేషన్‌ తర్వాత తెలంగాణలో 26 లోక్‌సభ సీట్లు!

April 16, 2026


img

నేడు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో డీలిమిటేషన్‌పై అధికార విపక్షాల మద్య వాడి వేడిగా చర్చలు జరిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ “ డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు తప్పుడు సమాచారంతో మాట్లాడుతూ ప్రజలలో అనుమానాలు, అపోహలు కలిగిస్తున్నాయి.

కానీ వాస్తవం ఏమిటంటే, డీలిమిటేషన్‌ తర్వాత తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి. ఇదేవిధంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 సీట్లు 38కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, కేరళలో 20 నుంచి 30కి లోక్‌సభ సీట్లు పెరుగుతాయి.

దక్షిణాది రాష్ట్రాల జనాభా శాతం కంటే సీట్ల పెరుగుతాయి. కనుక డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే విపక్ష వాదనలు అర్ధ రహితం,” అని అన్నారు. 

అమిత్ షా చెప్పిన దక్షిణాది సీట్ల లెక్కలపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ లోక్‌సభలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎంతమంది ఎంపీలు ఉంటారు? అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి దక్షిణాది రాష్ట్రాల మద్దతు అవసరం ఉంటుందా లేదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ రెండు ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెపితే బాగుండేది. 

<blockquote class="twitter-tweet" data-media-max-width="560"><p lang="en" dir="ltr">There will be no injustice to any southern state in delimitation. Speaking in the Lok Sabha.<br> <a href="https://t.co/1gBaGb8Vuj">https://t.co/1gBaGb8Vuj</a></p>&mdash; Amit Shah (@AmitShah) <a href="https://twitter.com/AmitShah/status/2044759490638340196?ref_src=twsrc%5Etfw">April 16, 2026</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


Related Post