విజయ్‌-సంగీత విడాకుల కేసు వాయిదా

April 20, 2026
img

కోలీవుడ్‌ హీరో, టివికే పార్టీ అధినేత విజయ్‌-సంగీతల విడాకుల కేసుపై నేడు విచారణ చేపట్టిన చెంగల్పట్టు సెషన్స్ కోర్టు ఈ కేసుని జూన్ 15కి వాయిదా వేసింది. ప్రస్తుతం విజయ్‌ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని లేకుంటే వాయిదా వేయాలని అభ్యర్ధించారు. 

ఇది విడాకుల కేసు కనుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు అనుమతించలేమని, అయన చెప్పిన కారణం సహేతుకమే కనుక అభ్యర్ధన మేరకు ఈ కేసు తదుపరి విచారణని జూన్ 15కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. 

అయితే తదుపరి విచారణకు విజయ్‌ తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. అందుకు విజయ్‌ న్యాయవాది అంగీకరించడంతో ఈ విడాకుల కేసు వాయిదా వేశారు. ఈ నెల 23 శాసనసభ ఎన్నికలు (పోలింగ్) జరుగుతుంది. మే  4న ఫలితాలు వెలువడతాయి. 

ఒకవేళ టివికే పార్టీ ఈ ఎన్నికలలో గెలిస్తే మే 15లోగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకే టివికే పార్టీ కాస్త హడావుడి ఉంటుంది. ఆ తర్వాత విజయ్‌ ఫ్రీ అయిపోతారు. కనుక జూన్ 15న విడాకుల కేసు విచారణకు విజయ్‌ హాజరయ్యేందుకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

Related Post