కోలీవుడ్ హీరో, టివికే పార్టీ అధినేత విజయ్ నుంచి విడాకులు కోరుతూ అయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. నేడు వారి విడాకుల కేసుపై కోర్టు విచారణ చేపట్టబోతోంది. ఆమె భర్త నుంచి రూ.250 కోట్లు భరణం కోరుతుండగా రూ.35 కోట్లు ఇచ్చేందుకు విజయ్ సిద్దమయ్యారు.
ఈ విషయం గురించి ఇరువురి న్యాయవాదులు అదివారం రాత్రి వరకు సుదీర్గంగా చర్చించారు. ఆమె రూ.35 కోట్లు భరణంకి అంగీకరిస్తే, కొడుకు, కూతురు పూర్తి బాధ్యత స్వీకరించేందుకు విజయ్ సంసిద్దత వ్యక్తం చేశారు.
కనుక భరణం విషయంలో వారి మద్య అంగీకారం కుదిరి ఉంటే నేడు కోర్టుకి ఆ విషయం తెలియజేసి పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతారు. లేకుంటే కేసు కొనసాగుతుంది. వారి విడాకుల కేసు ముగుస్తుందా? కొనసాగుతుందా? ఈరోజు తేలిపోతుంది.
ఈ నెల్లోనే విజయ్ జీవితం మరో మలుపు తిరుగబోతోంది. సినిమాలకు గుడ్ బై చెప్పేసి టివికే పార్టీతో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో ఆయన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది.
ఓ పక్క తమిళనాడు రాజకీయాలలో దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, అన్నాడీఎంకేలు... వాటితో కలిసి పోటీ చేస్తున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజేపిలున్నాయి. మరో పక్క బొత్తిగా రాజకీయ అనుభవం లేని విజయ్ తొలిసారి ఒంటరిగా వాటిని ఎదుర్కోబోతున్నారు.
కనుక ఈ ఎన్నికలలో గెలిస్తే తమిళనాడు రాజకీయాలలో ఆయన కొత్త అధ్యాయం ప్రారంభించిన వారవుతారు. కనీసం గౌరవ ప్రదమైన సీట్లు సాధించగలిగితే కింగ్ మేకర్ అవుతారు. లేకుంటే రాజకీయ ప్రయోగం విఫలమైనందున మళ్ళీ సినీ పరిశ్రమకి తిరిగిపోక తప్పదు.
ఒకే నెలలో వస్తున్న ఈ రెండు అతి పెద్ద మలుపులు విజయ్ జీవితంలో ఎటువంటి మార్పులు తెస్తాయో?