ప్రకాష్ రాజ్‌కు టిటిడి బోర్డు సభ్యుడు లీగల్ నోటీసు

April 18, 2026
img

కేరళలో సాహిత్య సదస్సులో పాల్గొన్న నటుడు ప్రకాష్ రాజ్, రామలక్ష్మణులు, రామాయణం గురించి చాలా చులకనగా, వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది.

తాజాగా టిటిడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆయనకు లీగల్ నోటీస్ పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా ఆయన పిచ్చి ప్రేలాపలాపనలను గమనిస్తున్నాను. ఆయనకు దమ్ముంటే ఇతర మతాల గురించి మాట్లాడాలి. 

కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాలైన శ్రీ సీతారామలక్ష్మణుల గురించి ఆయన చాల చులకనగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. హిందూమతమన్నా, హిందూ దేవుళ్లన్నా అయనకు అంత చులకన భావం దేనికో అర్థం కాదు. తరచూ తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు. 

ఆయన తక్షణం  బేషరతుగా హిందువులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేకుంటే ఆయనపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను. మా లాయర్ అజయ్ కుమార్‌ ద్వారా ఇప్పటికే ఆయనకు లీగల్ నోటీస్ పంపాను. అయన స్పందించి క్షమాపణలు చెప్తారనే భావిస్తున్నాను. 

క్షమాపణలు చెపితే సరిపోదు. ఇకపై మళ్ళీ ఎన్నడూ హిందూ మతం, హిందూ దేవుళ్ళపై తప్పుడు మాటలు మాట్లాడానని హామీ కూడా ఇవ్వాలి,” అని అన్నారు.      


Related Post