మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, “డీలిమిటేషన్ అంశాన్ని ముడి పెట్టడంతోనే ఈ మహిళా బిల్లు వీగిపోయింది. బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా… బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగింది. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్త బిల్లు తీసుకువచ్చి బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి...” అంటూ సోషల్ మీడియా ద్వారా పార్టీ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే...
మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీ పార్టీదే పూర్తి బాధ్యత
— BRS Party (@BRSparty) April 17, 2026
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
🔹 డీలిమిటేషన్ అంశాన్ని ముడి పెట్టడంతోనే ఈ మహిళా బిల్లు వీగిపోయింది
🔹 బీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా… బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగింది… pic.twitter.com/l2BxBsqc58